GNTR: తెనాలి పట్టణంలోని 18వ వార్డులో మున్సిపల్ ఛైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఇవాళ పర్యటించారు. వార్డులో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ పనులను పరిశీలించారు. స్థానిక ప్రజలతోపాటు మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాల్వలలో వ్యర్ధాలు వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వ్యర్ధాలు అడ్డుపడి మురుగు పారుదల సక్రమంగా ఉండటం లేదని పేర్కొన్నారు.