NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే దసరా మహోత్సవాల ఏర్పాట్లను దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో శీనా నాయక్‌లతో ఆదివారం సమీక్షించారు. వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. త్వరిత దర్శనం, తాగునీరు, అన్నప్రసాదాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విజయదశమి రోజున భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదంగా ఇవ్వనున్నారు.