TPT: పులివెందులలోని బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో నూలుపూజ పవిత్ర ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు బుధవారం శ్రీ రంగనాథ స్వామి అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.