పార్వతీపురం సబ్ జైలులో బుధవారం నిర్వహించిన న్యాయ సేవా శిబిరాన్ని రెండవ జిల్లా అదనపు న్యాయమూర్తి M. మాధురి ప్రారంభించారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే శిబిరం ఉద్దేశమని తెలిపారు. అనంతరం జైలును సందర్శించి ఖైదీల సమస్యలు తెలుసుకుని, ఎవరూ న్యాయ సహాయం లేకుండా ఉండకూడదని పేర్కొన్నారు.