ప్రకాశం: ఒంగోలు మండలం త్రోవగుంటలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం సమీపంలో కరవది గ్రామ్ వెళ్లే జంక్షన్ వద్ద వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఆంధ్రజ్యోతి ఏబీఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లే కార్డులతో దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఇంఛార్జ్ రవి, జడ్పీ ఛైర్మన్ వెంకాయమ్మతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.