ASR: సీపీఐ మావోయిస్టు పార్టీ చర్ల-శబరి ఏరియా కమిటీ సభ్యుడు రవ్వ కొస, పామేడ్ ఏరియా కమిటీ సభ్యుడు పోడియం రమేష్ లొంగిపోయారని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదివారం పాడేరులో తెలిపారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని తెలిపారు. లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు ప్రశాంత జీవనం గడిపేందుకు చెరొక రూ. 4 లక్షల రివార్డు అందిస్తామన్నారు.