VZM: గరివిడి మండలం గెడ్డపువలస గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై మంగళవారం గ్రామ సభను నిర్వహించారు. వ్యవసాయ విభాగం ప్రతినిధులు వెంకటలక్ష్మి, నారాయణమ్మ తదితరులు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలని, దీని ద్వారా ఎరువుల ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుందన్నారు. అనంతరం పలువురు ఆదర్శ రైతులకు సన్మానం చేశారు.