NLR: బుచ్చి నగర పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలందరూ ఇంటి పన్నులు చెల్లించే వారికి వడ్డీలు 50% రాయితీ ఉంటుందని చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి తెలిపారు. ఆమె నగర పంచాయతీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2024 25 సంవత్సరానికి గాను వన్ టైం సెటిల్మెంట్ చేస్తే వడ్డీలో మినహాయింపు ఉంటుందన్నారు. నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.