NLR: చేజర్ల మండలంలోని పాఠశాలకు చెందిన విద్యార్థి మౌనిషా జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపికైనట్లు మంగళవారం పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. వేల మంది పోటీపడ్డ పరీక్షలో తమ విద్యార్థి విజయం సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు.