పంజాబ్లోని హోషియార్పూర్ సమీపంలో ఓ క్షిపణిని గుర్తించారు. ఇది చైనాకు చెందిన PL-15 రకం ఎయిర్ మిస్సైల్గా బలగాలు గుర్తించాయి. ఈ తరహా క్షిపణిని పాకిస్తాన్ తమ JF-17 ఫైటర్ జెట్లలో వినియోగిస్తోంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నాయి. ఇది పొరపాటున వచ్చిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.