MNCL: సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి విజయవాడ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సోదాలు చేయడంపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ మీడియా జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.