NGKL: అమ్రాబాద్ మండలంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని శుక్రవారం అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరా గిరిజల వికాసం అనే పథకాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా నల్లమలకు వస్తున్నారు.