AKP: మాకవరపాలెం మండలం తామరం రెవిన్యూలో ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తహసీల్దార్ రామారావు అన్నారు. తామరం గ్రామంలో (61/3) ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని మంగళవారం ఆయన పరిశీలించారు. అయితే ప్రభుత్వ భూమే ఆక్రమ గురైనట్టు గుర్తించామన్నారు. అనంతరం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.