HNK: మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే ఉపవాసాల అసలు ఉద్దేశ్యం అని వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు అన్నారు. హసన్పర్తిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. తమ జీవిత సౌదాల్ని సత్యం, న్యాయం, ధర్మం అనే పునాదుల మీద నిర్మింపజేసుకునేందుకు ఉపయోగపడే సాధనమే ఉపవాస వ్రతం అన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.