NDL: పల్లెనిద్ర కార్యక్రమంలో శక్తి యాప్, రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్ మొదలగు వాటిపై విస్తృత అవగాహన కల్పించాలని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అన్నారు. మంగళవారం ఆళ్లగడ్డ పోలీసు అధికారులతో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ కేసుల ఆధారంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నేర నియంత్రణ కొరకు తీసుకోవలసిన చర్యలపై వివరించారు.