KMM: టీబీ వ్యాధిగ్రస్తులు మంచి పోషకాలు తీసుకోవాలని, మందులతో టీబీ పూర్తిగా తగ్గిపోతుందని DMHO డా. కళావతి బాయి అన్నారు. మంగళవారం జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో ఉన్న క్షయ వ్యాధి నివారణ కేంద్రం, ఖమ్మం (రూ) పొన్నెకల్లు ఆరోగ్య ఉప కేంద్రాలను సందర్శించారు. వ్యాధిగ్రస్తులు నిరాశ నిస్పృహ చెందకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండాలని సూచించారు.