ELR: నరసాపురం మండలం మోడి గ్రామం చామకూరిపాలెం పరిధిలోని ఆక్వా రైతు మామిడిశెట్టి గిరిధర్ మంగళవారం క్రాప్ హాలిడే ప్రకటించారు. ఏప్రిల్ 7న జరిగిన ఆక్వా మహా ధర్నా సందర్బంగా మూడు నెలలు ఆక్వా క్రాప్ హాలిడే ఇవ్వాలని కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీంతో రెండు నెలలు ముందే.. క్రాప్ హాలిడే ప్రకటించడం నియోజకవర్గం అంతా హాట్ టాపిక్‌గా మారింది.