SRD: కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా మే 20వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణం పోతులపల్లి లోని పీఎస్ఆర్ గార్డెన్లో కార్మిక సంఘాల నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.