TG: జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఒక్కటై నిలబడుతుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి ప్రకటించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.