అన్నమయ్య: అత్యవసరమైన సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎవరూ వెనకాడొద్దని రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సూచించారు. పెనగలూరు మండలం పొందలూరుకు చెందిన లేబాక సాయికుమార్ రెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.1,65,243 మంజూరైంది. ఆ చెక్కును ఎమ్మెల్యే మంగళవారం అందజేశారు.ఆసుపత్రిలో ఖర్చు చేసిన డబ్బులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించడానికి కృషి చేస్తానన్నారు.