KMM: పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఇందిర మహిళా డెయిరీ, సదరం క్యాంపుల నిర్వహణ, వితంతు పెన్షనులపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. పాల దిగుబడి ఎక్కువగా ఇచ్చే గేదెలను ఎంపిక చేయాలని, అలాగే యూనిట్లను అధికారులు తనిఖీలు చేస్తూఉండాలని సూచించారు.