TG: జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రమూకల దాడిని MIM పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి అమాయకులను చంపడం దుర్మార్గమైన చర్య అన్నారు. టూరిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్రానికి సూచించారు. కాగా, అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో పర్యటిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.