AP: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రేపు 108 మండలాల్లో, ఎల్లుండి 33 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల రుద్రవరం 41.6, ప్రకాశం దరిమడుగు 41.1, నెల్లూరు సోమశిలలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.