రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో ‘రాజాసాబ్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి మాళవిక మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో ఆమె భైరవిగా కనిపించనున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమా వచ్చే నెల 9న రిలీజ్ కాబోతుంది.