VZM: సోషలిస్టు దేశమైన క్యూబాకు కార్మికవర్గం యావత్తు అండగా నిలుద్దామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.శంకరరావు, రైతు సంఘం నేత ఎస్.గోపాలం కోరారు. బొబ్బిలి పట్టణంలో మంగళవారం క్యూబా సంఘీభావ నిధి సేకరించారు. పట్టణంలో పలు ప్రాంతాలలో కరపత్రాలు పంపిణీ చేసి, క్యూబా సంఘీభావ నిధిని కూపన్స్ ద్వారా సేకరించారు.