HNK: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం(PC&PNDT) ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన PC& PNDT అధారిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు చట్ట నియమాలను పాటించాలని, సక్రమంగా రికార్డులు నిర్వహించాలని సూచించారు.