WGL: సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్‌లో 16.7 ఎకరాల విస్తీర్ణంలో 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న జీప్లస్ టు కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు.