RR: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ నలందానగర్ కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించిన ఓ బిల్డింగ్ రెండు అంతస్తులను సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చి వేశారు. ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో కూల్చివేతలు ప్రారంభించారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా భవన యజమాని పట్టించుకోకపోవడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝలిపించారు.