MHBD: నెల్లికుదురు మండలం ఆలేరులోని శ్రీ రాజరాజేశ్వరి రైస్ మిల్‌పై జిల్లా సివిల్ సప్లై అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో PDS రేషన్ బియ్యం సుమారు 430 క్వింటాళ్లు అక్రమంగా తరలిస్తుండగా సంబంధిత సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు జిల్లా అధికారి ప్రేంకుమార్ తెలిపారు. లబ్ధిదారుల నుంచి అక్రమంగా కొనుగోలుచేసి వాటిని క్లీనింగ్ పాలిష్ చేస్తున్నట్లు తెలిపారు.