VSP: ఈ నెల 26న విశాఖకు మంత్రి లోకేష్ రానున్నారు. జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో మంత్రి లోకేష్ స్థానిక కూటమి నేతలతో సమావేశం కానున్నారు. మేయర్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం చేస్తున్న సమయంలో లోకేష్ పర్యటన రాక ప్రాధాన్యత సంతరించకుంది. టీడీపీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. అలాగే విశాఖ రాజకీయాలపై చర్చించనున్నారు.