KKD: పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర రోడ్లు మౌలిక సదుపాయాల నిధి (సీఆర్ఐఎఫ్) పథకం కింద సామర్లకోట- ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపామని అన్నారు. దీనికి రూ. 59.70 కోట్లు కేటాయించామన్నారు.