NRML: రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న స్పందన జాయింట్ గ్రీవెన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ జీ ఎమ్మార్వో శ్రీనివాస్ అన్నారు. మండల కార్యాలయంలో స్థానిక ఎస్సై సాయి కిరణ్‌తో కలిసి గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. నాయబ్ ఎమ్మార్వో వాహీద్ తదితరులున్నారు.