మేడ్చల్: అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్లో పని చేస్తూ ఇటీవల అనారోగ్యంతో కానిస్టేబుల్ హరీష్ బాబు, అలాగే ప్రమాదవశాత్తు అంబర్పేట ఆర్ముడు హెడ్ క్వార్టర్ కానిస్టేబుల్ బాలకృష్ణలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎల్బీ నగర్లోని రాచకొండ క్యాంపు కార్యాలయం వద్ద బాధిత కుటుంబ సభ్యులకు భద్రత చెక్కులు అందజేశారు.