ADB: ఉట్నూర్ పట్టణంలోని కోర్టులో పనిచేసే న్యాయవాదులు విధులను బహిష్కరించే నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చంపాపేట్ ఈస్ట్ మారుతి నగర్లో ఇజ్రాయిల్ అనే న్యాయవాదిని ఒక వ్యక్తి హత్య చేయడాన్ని నిరసిస్తూ ఉట్నూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులు బహిష్కరించారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు.