SKLM: కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా జాబ్ మేళాలను చేపడుతున్నామని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే వచ్చిన అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.