TG: SLBC టన్నెల్ నుంచి మరో మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. యూపీకి చెందిన ఇంజినీర్ మనోజ్‌గా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఫిబ్రవరి 22న ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 8 మంది లోపల చిక్కుకుపోగా, ఇప్పటివరకు రెండు మృతదేహాలను మాత్రమే వెలికి తీశారు.