E.G: గృహగణనలో భాగంగా ఎన్యుమరేటర్లు ఇప్పటి వరకు మీ ఇంటికి రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఇల్లు నమోదు కాని వారు కంట్రోల్ రూమ్ నంబర్ 9494060060కు ఫోన్, వాట్సప్ ద్వారా వివరాలు అందించి నమోదు చేసుకోవచ్చని సూచించారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో నగర ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన కోరారు.