ELR: జిల్లాలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఈనెల 18న ప్రారంభించనున్నట్లు ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం తెలిపారు. భీమడోలు మండలం సత్యనారాయణపురంలో ఉదయం 11:30 నిమిషాలకు బస్సును ప్రారంభిస్తామన్నారు. బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణిస్తారన్నారు. దివ్యాంగుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.