SKLM: పలాస మండలం గోపాలపురం సమీప పెద్ద చెరువులో శనివారం ఉదయం అస్థి పంజరం కలకలం రేపింది. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ దర్యాప్తు చేపడుతున్నారు. నీటిలో మునిగి మృతి చెంది ఉంటారని, శరీరం మట్టిలో కలిసిపోవడంతో ఎముకలు, చొక్కా, నిక్కరు మాత్రమే లభ్యమయ్యాయన్నారు. ఘటన జరిగి చాలా రోజులు అవ్వడంతో పోలీసులు దుస్తులు ఆధారంగా మృతిని వివరాలు ఆరా తీస్తున్నారు.