TPT: అవ్వ తాతలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన గూడూరు మండలం గాంధీనగర్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు అందించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లను 4000 రూపాయలకు పెంచి అందజేస్తుందన్నారు.