VZM : ఇటీవల గోవా గవర్నర్గా ఎన్నికైన మాజీ మంత్రి, విజయనగరం రాజు పూసపాటి అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టారు. అయితే మొదటిసారి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఇవాళ విజయనగరం కోటలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముందుగా పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.