ATP: పెద్దవడుగూరు మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మండల పరిధిలోని జాతీయ రహదారి 67 అప్పేచెర్ల, కృష్ణపాడు మధ్య ప్రాంతాలను బుధవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజాబాబు, ఎస్సై ఆంజనేయులు, ఆర్అండ్బీ జేఈ కోటీశ్వర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.