ASR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని డుంబ్రిగూడలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో సోమవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాదన (డిబేట్) పోటీలు నిర్వహించారు. మహిళల సాధికారత, బాలికల విద్య ప్రాధాన్యం వంటి అంశాలపై విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు, సైబర్ భద్రత అంశాలపై సూచనలు చేశారు.