ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దర్శి టీడీపీ నియోజకవర్గం ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుంచి బుధవారం వినతులు స్వీకరించారు. ఈ వినతులపై తక్షణం స్పందిస్తూ అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని కోరారు.