కోనసీమ: రావులపాలెం మండల బీజేపీ అధ్యక్షులుగా కె. ఈశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం మండలంలో బీజేపీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా శ్రీనివాస్ పాల్గొని ఈశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.