TPT: భారతదేశ టెలికాం విప్లవ ప్రముఖుడు, పద్మశ్రీ డాక్టర్ టి.హనుమాన్ చౌదరి శుక్రవారం శ్రీసిటీని సందర్శించారు. ఈ మేరకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ఆవిర్భావం, ప్రగతి, ప్రత్యేకతల గురించి వివరించారు. డాక్టర్ చౌదరి సందర్శన తమకు అత్యంత గౌరవప్రదం అని వ్యాఖ్యానించారు.