అన్నమయ్య: మదనపల్లె మండలం నిమ్మనపల్లె రోడ్డు వద్ద బుధవారం రాత్రి నిలబడి ఉన్న టీడీపీ నాయకులు శంకర్ (48) మరియు గోపాల్ (47)లను వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శంకర్ తిరుపతిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మదనపల్లె టమాట మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ తట్టి శ్రీనివాసులుకు చెందిన కారు ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.