ATP: జిల్లాల తలసరి ఆదాయంలో అనూహ్య మార్పులు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. 2022-23 సంవత్సరానికి గానూ సత్యసాయి జిల్లాలో తలసరి ఆదాయం రూ.2,19,234లు, అనంతపురం జిల్లాలో రూ.2,33,521లుగా నమోదైందని తెలిపారు. ఉద్యాన రంగంలో అభివృద్ధి కారణంగా అనంతపురం జిల్లా తలసరి ఆదాయంలో వృద్ధిని సాధించిందని తెలిపారు.