కోనసీమ: అయినవిల్లి మండలానికి చెందిన అగ్రికల్చర్ లెక్చరర్ గిడ్ల భారతి సౌమ్య ప్రతిష్ఠాత్మకమైన మహిళా కీర్తిరత్న పురస్కారం అందుకున్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక సౌమ్యకు ఈ పురస్కారాన్ని అందించింది. ప్రముఖ సామాజిక కార్యకర్త కత్తిమండ ప్రతాప్ ఈ పురస్కారాన్ని అందజేశారు. విద్యారంగంలో చేస్తున్న విశేషకృషికి ఈ పురస్కారం అందించారు.