NLR: చిట్వేలి మండల పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్వేల్ -రాపూరు ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు బలంగా ఢీకొన్నాయి. చిట్వేల్ నుంచి నెల్లూరు వెళ్తున్న లారీ, నెల్లూరు నుంచి వస్తున్న కారు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో కారులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.